Ad Code

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లతో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 సిరీస్‌ విడుదల !


శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ S10 సిరీస్‌ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ట్యాబ్‌ S10+, గెలాక్సీ ట్యాబ్‌ S10 అల్ట్రా విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ సిరీస్‌ ప్రారంభ ధర రూ.90,999 గా ఉంది. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ S10 అల్ట్రా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 14.6 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI (అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌) OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 16GB ర్యామ్‌ మరియు 1TB స్టోరేజీతో జతచేయబడింది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 11,200mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్, ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, బ్లూటూత్‌ 5.3, వైఫై 7, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. 12GB, 16GB ర్యామ్ మరియు 256GB, 512GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మరియు మూన్‌స్టోన్ గ్రే, ప్లాటినం సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. అదే S10+ 12GB ర్యామ్‌తో 256GB, 512GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1.5TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. గెలాక్సీ ట్యాబ్‌ S10+ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 12.4 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OneUI కస్టమైజేషన్‌ ను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీతో జతచేసి ఉంది. మూన్‌స్టోన్ గ్రే, ప్లాటినం సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ ట్యాబ్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 10,090mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 12MP అల్ట్రావైడ్‌ సెల్ఫీ కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.3, వైఫై 6E, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ S10 సిరీస్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. స్కెచ్‌ టూ ఇమేజ్, సర్కిల్ టూ సెర్చ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు నోట్‌ అసిస్ట్‌, డ్రాయింగ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లున్నాయి. దీంతోపాటు బుక్‌ కవర్‌ కీబోర్డుతో గెలాక్సీ AI కీ కూడా కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu