జమ్మూ కాశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తవగా చివరి దశ ఎన్నికల్లో జరగబోతున్నాయి. ఇందుకోసం పార్టీ తరఫున జమ్మూ కాశ్మీర్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సభలో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఆయన స్టేజ్ పైనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సభలోనే కళ్లు తిరిగి కిందపడిపోబోయారు. వెంటనే గమనించిన స్టేజీపైన ఉన్న నాయకులు మల్లికార్జున ఖర్గేను పట్టుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గేకు మంచినీళ్లు అందించారు. నీళ్లు తాగిన తర్వాత కొద్దిక్షణాలకే నార్మల్ అయిన మల్లికార్జున ఖర్గే తిరిగి ప్రసంగాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే ప్రసంగం కొనసాగినంతసేపు స్టేజీపై ఉన్న నాయకులు ఖర్గేను పట్టుకునే ఉన్నారు. ఖర్గే అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తామని మాటిచ్చారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. తాను అప్పుడే చనిపోనని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని సవాల్ చేశారు.
0 Comments