రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని మూడేండ్లలోపే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. 2027 డిసెంబర్ కల్లా సౌత్ అండ్ నార్త్ రెండు వైపులా నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నది. రెండు, మూడు నెలల గ్యాప్‌లోనే ఇరు వైపులా పనులను మొదలుపెట్టడమే కాకుండా సమాంతరంగా వర్క్స్చేయడంపైనా ఫోకస్పెట్టింది. నేషనల్ హైవేస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నార్త్‌సైడ్ అలైన్మెంట్ పూర్తికాగా.. భూసేకరణ కూడా 90 శాతం కంప్లీట్అయింది. దాదాపు 750 ఎకరాల వరకు హైకోర్టులో కేసు నడుస్తున్నది. అది కూడా అలైన్మెంట్ మార్పు కోరుతూ వేసిన పిటిషన్ కావడంతో.. వారం రోజుల్లో వెకెంట్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక సౌత్‌కు సంబంధించి ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని, అలైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ట్రిపుల్ఆర్పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రభుత్వం తరఫున యాక్షన్ ప్లాన్‌ను అందివ్వనున్నట్టు తెలుస్తున్నది. తొలుత రీజినల్ రింగ్ రోడ్డును 4 లేన్లకే పరిమితం చేసి, ఆ తర్వాత మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగిన సమయంలో నిర్మించనున్నట్టు తెలిసింది. భూసేకరణ మాత్రం 8 లేన్లకు సరిపడా చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు మరో ఏడు జిల్లాల ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, ఉత్తర భాగం కలిపితే దాదాపు 350 కిలో మీటర్లకు కొంచెం అటు ఇటుగా ఉండనుంది. ఇప్పటికే నార్త్రింగ్కు (ఎన్‌హెచ్-65 మీదుగా తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్) సంబంధించి 158 కిలో మీటర్లకు అలైన్మెంట్పూర్తయింది. 4 వేల 875 ఎకరాల భూ సేకరణ కూడా కంప్లీట్అయింది. అలైన్మెంట్ మార్చాలంటూ కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇది దాదాపు 750 ఎకరాలు ఉంది. పరిహారం విషయంలో ఎక్కడా సమస్య లేకపోవడం, అలైన్ మెంట్అనేది మార్చడం సాధ్యం కాదనే విషయాన్ని కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. దీంతో వారం, పదిరోజుల్లో ఈ కేసు పూర్తి కానుంది. ఆ వెంటనే భూసేకరణ కంప్లీట్‌చేసి, నేషనల్హైవేస్కు అప్పగించనున్నది. దీంతో టెండర్ నోటిఫికేషన్వేసి, నిర్మాణ పనులు మొదలుపెట్టేలా ముందుకు వెళ్తున్నది. ఇక దక్షిణ భాగానికి సంబంధించి 190 నుంచి 194 కిలో మీటర్ల వరకు అలైన్మెంట్ఉండే అవకాశం ఉన్నది. ఈ అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 12 మందితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్‌డేట్ చేస్తున్నారు. ట్రిపుల్ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్షలతోపాటు భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రతిరోజూ సీఎం రేవంత్ రెడ్డి మానిటర్ చేస్తున్నారు. అలైన్మెంట్కంప్లీట్ చేయగానే ఒకసారి ఎన్ హెచ్ఏఐ తో సంప్రదింపులు జరిపి, ఫైనలైజ్ చేస్తారు. రెండు, మూడు నెలల్లోపే భూ సేకరణ పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే నేషనల్హైవేస్కు అప్పగించనున్నట్టు తెలుస్తున్నది. ట్రిపుల్ఆర్గురించి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నది. ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నది. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో.. ఈ సిటీని రీజినల్ రింగ్ రోడ్డుకు లింక్ చేయనున్నది. అదే సమయంలో ఓఆర్‌ఆర్‌కూ ట్రిపుల్ఆర్కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నది. ఇందుకోసం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్‌రోడ్లు వేయనున్నది. సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవిష్యత్తులో ఈ మార్గంలో వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగానే ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల నుంచి ట్రిపుల్ఆర్లోని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్-13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనున్నది. ఈ మార్గం మొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనున్నది. ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న వారికి తగిన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే నార్త్‌లో కొందరికి సవరించిన మార్కెట్వాల్యూకు తగ్గట్టుగా పరిహారం అందిస్తున్నది. సౌత్ సైడ్‌కు సంబంధించి కూడా పెంచిన పరిహారమే అందనున్నది. త్వరలోనే ప్రభుత్వం మార్కెట్ వాల్యూను సవరించనున్నది. దీంతోపాటు ఆయా ఏరియాల్లో గరిష్టంగా ఏ రేటుకు భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయో దాంట్లో హయ్యెస్ట్ తీసుకొని అటు ప్రభుత్వ రేటు.. అంతకు మించి ఎక్కువకు కొనుగోళ్లు చేసిన రేటులో నుంచి యావరేజ్ తీసి దానికి మూడింతలపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదాహరణకు ఒక ఎకరాకు ప్రభుత్వ మార్కెట్‌రేటు రూ.10 లక్షలు ఉంటే బహిరంగంగా 15 లక్షలకు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి ఉంటే.. ఇందులో యావరేజ్ రూ.13 లక్షలు తీసుకొని, దీనిని మూడింతలు అంటే రూ.39 లక్షలు చేసి పరిహారం ఇవ్వనున్నారు. దీంతో రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని, భూసేకరణ కూడా వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అవసరమైతే అంత కంటే ఎక్కువే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నది.
0 Comments