లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు లావా తెలిపింది. బడ్జెట్ ధరలో 3D కర్వుడ్ స్క్రీన్ తో లావా చరిత్ర సృష్టించిన అగ్ని 2 5జి ఫోన్ జనరేషన్ ఫోన్ గా లావా అగ్ని 3 ని తీసుకువస్తున్నట్లు చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకమైన కస్టమైజబుల్ యాక్షన్ బటన్, 50MP OIS కెమెరా సెటప్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్ లో విడుదల కావడానికి ఈ ఫోన్ సిద్ధం గా ఉందని లావా చెబుతోంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుందని కూడా లావా చెబుతోంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా ఉంది మరియు దానికి జతగా మరో రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ మరియు కర్వుడ్ డిజైన్ ను కలిగి వుంది.
0 Comments