బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ఇన్పుట్ ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలిక వ్యయాలు అధికం అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలను దాదాపు 9-12 శాతం పెంచాలని నిర్ణయించారు. జనవరి 1, 2025 నుంచి ఈ ధరల పెంపు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ..'వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి, వారికి మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ ధరల పెంపు చాలా అవసరం. ఇది కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది' అన్నారు.
బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీల పెంపు!
by Telugu Lo Computer at September 30, 2024
Labels:
business
,
national
,
కంపెనీ ప్రకటన
,
కార్యాచరణ ఖర్చులు
,
జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలు
,
ద్రవ్యోల్బణం కారణంగా
,
బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీల పెంపు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment