Ad Code

వాయు నాణ్యత నిర్వహణ కమీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం !


ఢిల్లీలో వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఏజీ మాసిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని, ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదన్నారు. సీఏక్యూఎం పూర్తిగా పనిచేయలేదని చెప్పడం లేదని, కానీ అనుకున్న రీతిలో ఆ ప్యానెల్ పర్ఫార్మ్ చేయలేదని జస్టిస్ ఓకా వెల్లడించారు. శీతాకాల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యం నమోదు అయ్యే విషయం తెలిసిందే. పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో వాయు కాలుష్యం జరుగుతున్నది. మీరు తీసుకున్న చర్యల వల్ల కాలుష్యం తగ్గిందా అని సీఏక్యూఎం చైర్మెన్ రాజేశ్ వర్మను సుప్రీంకోర్టు అడిగింది.

Post a Comment

0 Comments

Close Menu