Ad Code

సెల్ ఫోన్ - సైడ్ ఎఫెక్ట్స్ ?


కౌమర దశలో ఉన్నవారు స్మార్ట్ ఫోన్ ని వాడడంపై కొరియాలోని హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ బృందం పలు రకాల పరిశోధనలు చేసింది. ఇది 50వేల కంటే ఎక్కువ మందిపై కొన్ని అధ్యయనాలు చేసింది. అయితే ఈ కౌమార దశలో ఉన్నవారు రోజుకు నాలుగు గంటల కంటే అధిక టైం స్మార్ట్ ఫోన్ ను వాడడం వలన ఒత్తిడి, ఆత్మహత్య,ఆలోచనలు, మాదకద్రవ్యాల వాడకం లాంటి అలవాట్లు అధికంగా ఉన్నాయని తేలింది. అలాగే ఫోన్ ని చాలా తక్కువగా వినియోగించే వారిలో మాత్రం ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయి అని తేలింది. దృష్టిలోపం ఏర్పడుతుంది : ఫోన్ ను ఎక్కువగా వాడితే నిద్రపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రీన్ చూస్తే సరిగ్గా నిద్ర కూడా పట్టదు. దీనివలన మేలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం అనేది ఏర్పడుతుంది. అలాగే ఫోన్ లైట్ ఎక్కువగా కంటి పై పడడం వలన నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫోన్ చూస్తూ ఉండడం వలన కళ్ళు పొడిబారిపోవడం మరియు తలనొప్పి, నీరసం, అలసట లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కంటి సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాక రోజంతా ఫోన్ వాడడం వలన మెడ మరియు వెన్నుముక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున సెల్ ఫోన్ వాడేవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని అంటున్నారు..

Post a Comment

0 Comments

Close Menu