Ad Code

టాటా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన !


మిళనాడులోని పనపక్కం జిల్లా పరిధిలో టాటా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు. రూ.9000 కోట్ల అంచనా వ్యయంతో టాటా మోటార్స్ తన న్యూ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మించనున్నది. దీనివల్ల యువతకు కొత్తగా 5,000 ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర రాజధాని చెన్నైకి 115 కి.మీ దూరంలో ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు రాష్ట్ర మంత్రులు దురాయి మురుగన్, టీఆర్ బీ రాజా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని పెద్ద కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపెనీలకు తమిళనాడు తొలి పెట్టుబడి కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా వాసి ప్రపంచంలోనే పేరొందిన కంపెనీకి సారధ్యం వహించడం రాష్ట్రానికే గర్వ కారణం అని పేర్కొన్నారు. తమిళనాడులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మార్చిలో టాటా మోటార్స్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.

Post a Comment

0 Comments

Close Menu