ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
0 Comments