Ad Code

చెన్నై పోర్ట్ లో 110 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ పట్టివేత !


చెన్నై పోర్టులో మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లే  కార్గో షిప్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్రయత్నంచినందుకు చెన్నైకి చెందిన ఇద్దరు కార్గో షిఫ్ ఏజెంట్లు అబుతాహిర్ (30), అహ్మద్ భాషా (35) లను అరెస్ట్ చేశారు. ఇందులో అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ ప్రమేయం ఉన్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఎఫిడ్రిన్ మెథాంఫేటమిన్ తయారీకి ఉపయోగించబడుతుందని గుర్తించారు. ప్రస్తుతం భారీ మొత్తం డ్రగ్స్ అక్రమ రవాణాపై విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు మీడియాకు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu