స్మార్ట్ యోగా మ్యాట్ ?


స్మార్ట్ యోగా మ్యాట్ యోగా మ్యాట్ లాగానే కిందేసుకుని యోగా చేసుకోవచ్చు. కానీ ఈ స్మార్ట్ యోగా మ్యాట్ మీతో మాట్లాడుతుంది. దీన్ని ఇంట్లో ఉన్న వైఫై కి దీన్ని కనెక్ట్ చేస్తే మాట్లాడమే కాదు మీతో సరిగ్గా యోగా కూడా చేయిస్తుంది. వైఫై ద్వారా మీ స్మార్ట్ టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీలో చూస్తూ యోగాసనాలు నేర్చుకున్నట్లయితే చేస్తున్న ఆసనాల గురించి సూచనలు చేస్తుంది. ఆసనాలు తప్పుగా వేస్తే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. అంతేకాదు మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు కౌంటింగ్ కూడా చేస్తుంది. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఎప్పుడు శ్వాస పీల్చుకోవాలి.. ఎప్పుడు వదిలేయాలన్న విషయాన్ని కూడా చెబుతుంది. ప్రతిరోజు మీ బిఎంఐ  చెక్ చేస్తుంది. మీ బరువు, ఫ్యాట్, ఉండాల్సిన బరువు వీటన్నింటినీ ప్రతిరోజు చెప్తూ ఉంటుంది. మీరేమైనా గోల్స్ పెట్టుకుంటే దానికి అనుగుణంగా ఎన్ని ఆసనాలు ఎన్నిసార్లు వేయాలనేది ఆటోమేటిక్ గా లెక్కలేసుకొని సూచిస్తుంది. వారానికి ఒకసారి దీనికి చార్జింగ్ పెడితే చాలు. స్మార్ట్ యోగా మ్యాట్‌లో చిన్న బ్యాటరీ, చిన్న స్పీకర్ అమర్చారు. ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేస్తేనే దీని ఫీచర్స్ అన్ని వాడుకునే అవకాశం ఉంది. యోగా చేస్తున్నప్పుడు ఆంబియన్స్ కోసం మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org