ధర రూ.999 కే నాయిస్‌ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ !


నాయిస్‌ అధికారిక ప్లాట్‌ ఫాం gonoise.com, ఫ్లిప్‌ కార్ట్‌లో నాయిస్‌ పాప్ ఇయర్‌ బడ్స్‌ను భారత్‌లో రూ.999 కే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మూన్‌ పాప్‌, స్టీల్‌ పాప్‌, ఫారెస్ట్‌ పాప్‌, లిలక్‌ పాప్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. నాయిస్‌ పాప్‌ పడ్స్‌ 10mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. మరియు క్వాడ్‌ మైక్‌తో  ఎన్విరాన్‌మెంటల్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌  టెక్నాలజీతో లాంచ్‌ అయింది. సినిమాలు చూస్తున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు, గేమింగ్‌ సమయంలో నాణ్యమైన సౌండ్‌ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. దీంతోపాటు ఈ నాయిస్‌ ఇయర్‌ బడ్స్‌ మెరుగైన ఛార్జింగ్‌ టెక్నాలజీతో లాంచ్ అయింది. ఈ InstaCharge టెక్నాలజీతో కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ ద్వారా 150 నిమిషాల ప్లేటైం ను పొందవచ్చు. ఫలితంగా అత్యవసర సమయాల్లో ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి సింగిల్ ఛార్జింగ్‌ ద్వారా 50 గంటల ప్లేటైం ఇస్తుందని సంస్థ తెలిపింది. నాయిస్‌ కొత్త వైర్‌ లెస్‌ ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్‌ 5.3 వెర్షన్‌ మరియు 40ms లెటెన్సీ ద్వారా మెరుగైన ఆడియో ను పొందవచ్చు. మరియు ఇతర డివైస్‌లతో సులభంగా కనెక్ట్ కావచ్చు. దీంతోపాటు అనేక ఫీచర్లు ఈ నాయిస్‌ కొత్త ఇయర్‌ బడ్స్‌ సొంతం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org