భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కింద అన్లిమిటెడ్ 5జీ డేటా, ఇతర బెనిఫిట్స్‌తో కూడిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను అందిస్తోంది. రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 3జీబీ రోజువారీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్తో కూడిన ఫుల్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ్యాలిడిటీనిఅందిస్తుంది. అదనంగా, ఎయిర్టెల్ కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ మూవీలు, టీవీ షోల లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ యూజర్లు 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఫ్రీ హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ వంటి ఇతర పెర్క్‌లు ఉన్నాయి. ఆసక్తికరంగా, నెట్‌ఫ్లిక్స్ ఇకపై తన ప్రైమరీ ప్లాన్‌ని నేరుగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా కొత్త సబ్స్క్రైబర్లకు అందించదు. అయితే, ఎయిర్టెల్ యూజర్లు ఈ ప్లాన్‌ను పొందవచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరకు ఎస్డీ క్వాలిటీలో మూవీలు, టీవీ షోల లైబ్రరీకి యాక్సస్ పొందవచ్చు. ఈ ప్లాన్ ఒక సమయంలో ఒక డివైజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. వ్యక్తిగత యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అత్యధిక రిజల్యూషన్ లేదా అకౌంట్ షేరింగ్ చేసే సామర్థ్యాన్ని అందించనప్పటికీ, అనేక రకాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను పొందాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనే. అయినప్పటికీ, ఎయిర్టెల్ రూ. 1,499 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను ఈజీగా పొందవచ్చు.
ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ !
by Telugu Lo Computer at May 01, 2024
Labels:
499 ప్రీపెయిడ్ ప్లాన్ 3జీబీ రోజువారీ డేటా
,
science
,
technology
,
అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్
,
ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్
,
రూ. 1
,
రోజుకు 100 ఎస్ఎంఎస్తో ఫుల్ ప్యాకేజీ
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment