ఎంట్రీ లెవల్ కోడింగ్ రోల్స్‌పై ఏఐ ఎఫెక్ట్ !


ఐటీ వంటి టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై ఆటోమేషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ రాకతో ఉద్యోగాల కోత తప్పదని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే టెక్ కంపెనీలు పరిమితంగా రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి. ముఖ్యంగా నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాయి. ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ టీమ్ ఎగ్జిక్యూటివ్స్ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పరిశ్రమల స్థాయి నియామకాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐఐటీల్లో ప్రీమియర్ ఫస్ట్-జనరేషన్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన కొంతమంది విద్యార్థులు సైతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపిక కాలేదు. ఐఐటీ-బీహెచ్‌యూ ప్లేస్‌మెంట్-ఇన్‌ఛార్జ్ ప్రొఫెసర్ SK శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ''AI అనేది కాన్సెప్ట్‌గా కొత్తది కాదు. ప్రస్తుత యుగంలో అప్లికేషన్‌ రూపంలో విస్తృతంగా అప్‌గ్రేడ్ అయింది. దీని ప్రభావం క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐ కారణంగా కోడింగ్ వంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు నియామకం బాగా తగ్గింది. ఉదాహరణకు కోడింగ్ రోల్స్ కోసం గతంలో నలుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంటే, ప్రస్తుతం AIతోనే బేసిక్స్ స్థాయిలో అల్గారిథమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఫలితంగా ఈ సంవత్సరం ఇద్దరు విద్యార్థులను మాత్రమే కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి.'' అని SK శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తయారీ రంగానికి చెందిన కంపెనీలు ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నాయి. అయితే సాఫ్ట్‌వేర్ స్కిల్స్ అవసరమని భావించి, సాఫ్ట్‌వేర్ రోల్స్ కోసం విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ''అత్యధిక నియామకాలు స్టార్ట్-అప్ కంపెనీలు చేపడుతున్నాయి. వీటిలో చాలా వరకు అంతర్జాతీయ క్లయింట్‌లతో యునికార్న్‌ సంస్థలు ఉంటున్నాయి. ఐఐటీ టాలెంట్ పూల్ నుంచి విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.'' అని శ్రీవాస్తవ అన్నారు. ఈ ఏడాది క్యాంపస్‌లకు వచ్చే అంతర్జాతీయ కంపెనీల సంఖ్య తక్కువగా ఉండగా, వాటి ద్వారా ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని టాప్ ఐఐటీల్లో ఒకదాని స్టూడెంట్ ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐఐటీ ఇండోర్‌ ప్లేస్‌మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రిక్రూట్‌మెంట్ నంబర్‌లతో పాటు కంపెనీలు ఆఫర్ చేసే ఫ్యాకేజీ సవాల్‌గా ఉండవచ్చని తెలిపారు. ''రిక్రూటర్లు ఇప్పుడు సాధారణ రోల్స్ కంటే నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ రోల్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. గత సంవత్సరం వరకు దాదాపు 8-10 మంది విద్యార్థులను నియమించుకున్నారు. ఇది ఇప్పుడు సగానికి పడిపోయింది.'' అని సదరు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చెప్పారు. బిట్స్ పిలానీ చీఫ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ G బాలసుబ్రమణియన్ ప్రకారం.. అధిక, తక్కువ-నాణ్యత కోడ్‌ను ఉత్పత్తి చేయడంలో కీలకమైన జూనియర్-లెవల్ కోడింగ్ రోల్స్‌పై ChatGPT వంటి AI సాఫ్ట్‌వేర్‌ ఆటోమేటెడ్ కోడ్ ఉత్పత్తి ప్రభావం పడింది. అయితే, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం బిగే లాంగ్వేజ్ నమూనాలను ఉపయోగించే డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు వంటి అభివృద్ధి చెందుతున్న రోల్స్‌లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్‌లకు డిమాండ్ పెరుగుతోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org