చంద్రగిరిలో కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం


ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరిలో ఈ వేకువ ఝామున కొంగరవారిపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు నెల్లూరువాసులుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. వాళ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న స్థితిని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గడ్డపార సాయంతో ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలుకొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment

3