పాత ఫోనే సీసీటీవీ కెమెరా ?
సీసీటీవీ కెమెరాల వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం దుకాణాలకే పరిమితమైన వీటిని ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సీసీటీవీ కెమెరా సెటప్ అంటే ఖర్చుతో కూడుకున్న పని. పాత ఫోన్‌నే సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవచ్చు. దీని కోసం ముందుగా మీ పాత స్మార్ట్ ఫోన్‌తో పాటు మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్‌లో సెక్యూరిటీ కెమెరా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేసిన అవసరమైన పర్మిషన్స్‌తో పాటు గూగుల్ అకౌంట్‌లోకి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. రెండు ఫోన్లలోనూ సైన్ ఇన్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్ ఆన్/ఆఫ్, లో లైట్ ఫిల్టర్ వంటి ఫీచర్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అనంతరం మీరు సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగించుకోవాలనుకుంటున్న కెమెరాను కావాల్సిన చోట ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఫోన్స్ అందుబాటులో ఉన్నా పలు డైరెక్షన్స్‌లో ఫోన్‌లను ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం పాత ఫోన్‌లో సెక్యూరిటీ కెమెరా యాప్‌ను ఓపెన్ చేసి ఉంచాలి. దీంతో పాత కొత్త ఫోన్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ను చూసుకోవచ్చు.