స్పెయిన్ లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 నిన్న ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆధునిక సాంకేతికతతో తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. దీనిలో అమెరికాకు చెందిన లెనోవో కంపెనీ ట్రాన్స్పరెంట్ డిస్ ప్లే, కీబోర్డ్జ్ తో కూడిన ల్యాప్ టాప్ లెనోవో థింక్బుక్ ట్రాన్స్పరెంట్ ని ప్రవేశపెట్టింది. 17.3 అంగుళాల బెజెల్ లెస్ స్క్రీన్, 720పీ రిజల్యూషన్ తో మైక్రో ఎల్ఈడీ స్క్రీన్, ఫ్లోటింగ్ ఫుట్ప్యాడ్ డిజైన్ ని కలిగి ఉన్న ట్రాన్స్పరెంట్ కీబోర్డ్ ని కలిగి ఉంది. ట్రాన్స్పరెంట్ డిస్ప్లే, కీబోర్డ్తో పాటు లెనోవో ఈ ల్యాప్టాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ కంటెంట్ ని కూడా చేర్చింది. దీన్ని కొనుగోలు చేయడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఈ ల్యాప్టాప్ ఛాసిస్ పై కెమెరా ఉంది. దీని ద్వారా ఏఐని ఉపయోగించి, కెమెరా ముందున్న వస్తువును తాలూకు డిజిటల్ వెర్షన్ను ల్యాప్టాప్లో ప్రదర్శిస్తుంది. ఈ లెనోవో ల్యాప్టాప్లో అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ గురించి చెప్పాలంటే ఇది విండోస్ 11పై నడుస్తుంది. ఈ ల్యాప్టాప్ ప్రత్యేకత ఏమిటంటే దాని డిస్ప్లే పారదర్శకంగా ఉంటుంది. దీని కీబోర్డ్ కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇది అవసరమైనప్పుడు లేజర్ కీలను ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ కీబోర్డ్ స్టైలిష్ సపోర్ట్తో స్కెచ్ప్యాడ్గా కూడా పనిచేస్తుంది. అంటే మీరు ఈ ల్యాప్టాప్లో ఏదైనా టైప్ చేసినప్పుడు, మీరు బటన్కు సంబంధించిన ఫిజికల్ టచ్ను ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఈ ల్యాప్టాప్లో టైప్ చేయడానికి వినియోగదారులు ఫ్లాట్ సర్ఫేస్ను పొందుతారు. అందువల్ల ఇది టచ్ డిస్ప్లేగా కూడా పని చేస్తుంది. థింక్బుక్ ట్రాన్స్పరెంట్ డిస్ప్లేలోని డిస్ప్లే ప్యానెల్ మైక్రోఎల్ఈడీ టెక్నాలజీతో తయారు అయిందని లెనోవా ధ్రువీకరించింది. ఈ ల్యాప్టాప్ గరిష్టంగా 1000 నిట్ల ప్రకాశంతో వస్తుంది. దీని కారణంగా వినియోగదారులు ఈ ల్యాప్టాప్ను బలమైన సూర్యకాంతిలో ఇండోర్, అవుట్డోర్లో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
0 Comments