ఇంటర్నెట్లో కనిపించే వీడియోల్లో ఏది నిజమైనది? ఏది నకిలీ? అన్నది తెలుసుకునేలా వాట్సాప్.. 'మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్' అనే సంస్థతో కలిసి ఓ ప్రత్యేక హెల్ప్ లైన్‌ను రూపొందించనుంది. ఇది వచ్చేనెల నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్ సాయంతో డీప్ ఫేక్ వీడియోలను సులభంగా గుర్తించే వీలుంటుంది. తప్పుడు సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం ఇలా వివిధ బాషల్లో అందుబాటులో ఉండే ఈ హెల్ప్ లైన్ ద్వారా యూజర్లు తమ దగ్గరకు వచ్చిన వీడియోలను చెక్ చేసుకోవచ్చు. ఇలా యూజర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందిచేందుకు 'డీప్‌ఫేక్ ఎనాలసిస్ యూనిట్' ను రూపొందిస్తున్నట్టు వాట్సాప్ చెప్తోంది. ఫేక్ సమాచారాన్ని గుర్తించడం, అరికట్టడంలో భాగంగా యూజర్లను అప్రమత్తం చేసేందుకు గానూ వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు మెటా ప్రకటించింది. ఏదైనా సమాచారాన్ని ఫార్వార్డ్ చేసేముందు ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.
వాట్సాప్ నుంచి డీప్‌ఫేక్ ఎనాలసిస్ యూనిట్ ?
by Telugu Lo Computer at February 20, 2024
Labels:
meta
,
science
,
technology
,
WhatsApp
,
మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్
,
వాట్సాప్ నుంచి డీప్‌ఫేక్ ఎనాలసిస్ యూనిట్ ?
,
వివిధ బాషల్లో అందుబాటులో ఉండే హెల్ప్ లైన్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment