మోటరోలా మోటో జీ పవర్ 5జీ ఫోన్ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనుంది. గతేడాది ఏప్రిల్ లో ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 ఎస్వోసీ చిప్ సెట్, 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఆవిష్కరించిన మోటో జీ పవర్ 5జీ కి కొనసాగింపుగా మోటో జీ పవర్ 5జీ వస్తున్నది. మోటో జీ పవర్ 5జీ ఫోన్ ఔటర్ స్పేస్, ఆర్చిడ్ టింట్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 30వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ఫుల్ హెచ్డీ+ (1200 x 1600 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల స్క్రీన్ వైట్ లేదా సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తున్నది. అలాగే బ్యాక్ ప్యానెల్ మీద రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, రైట్ ఎడ్జి వైపు పవర్ బటన్, స్పీకర్ గ్రిల్లె, వాల్యూమ్ రాకర్స్, ఉంటాయి. మోటో జీ పవర్ 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24,500 (299.99 డాలర్లు) పలుకుతుంది.
ఏడాది చివర్లో మోటో జీ పవర్ 5జీ 2024 విడుదల ?
by Telugu Lo Computer at February 26, 2024
Labels:
30వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ఫుల్ హెచ్డీ+ (1200 x 1600 పిక్సెల్స్) డిస్ ప్లే
,
motorala
,
science
,
smart phone
,
technology
,
ఏడాది చివర్లో మోటో జీ పవర్ 5జీ 2024 విడుదల ?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment