ప్రపంచవ్యాప్తంగా నైక్ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఖర్చు తగ్గించే చర్యలో భాగంగా, నైక్ తన శ్రామికశక్తిలో 2 శాతం మందిని తొలగిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తొలగింపుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో 1,600 మందికి పైగా ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి తొలగింపులు ప్రారంభమవుతాయని నివేదిక పేర్కొంది. అలాగే రెండో దశ కూడా త్రైమాసికం చివరి నాటికి పూర్తవుతుంది. తొలగింపులను ట్రాక్ చేసే వెబ్‌సైట్ నుండి తాజా గణాంకాల ప్రకారం, జనవరి 1, ఫిబ్రవరి 16 మధ్య, ప్రపంచవ్యాప్తంగా 154 టెక్నాలజీ కంపెనీలు 39,400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. వివిధ విభాగాల్లోని 500 మంది ఉద్యోగులను గూగుల్ తొలగిస్తోంది. అమెజాన్ తన ఆరోగ్యం, గేమింగ్ విభాగాల నుండి దాదాపు 1,900 ఉద్యోగాలను కూడా తొలగిస్తోంది.
0 Comments