కృత్రిమ మేధ ఆధారిత ఎడ్యుకేషనల్ మిల్క్ వే టాబ్లెట్ విడుదల !


దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ తయారీ ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను ఎపిక్ ఫౌండేషన్ అనే సంస్థ 'మిల్క్‌వే' పేరుతో విడుదల చేసింది. దీనిని MediaTek మరియు CoRover.ai సహకారంతో VVDN టెక్నాలజీస్ రూపొందించింది. ఈ MILKYWAY టాబ్లెట్ చాలా ప్రత్యేకమైనది, ఇది ChatGPTకి దేశీయ అవతారంగా చెప్పే BharatGPT ద్వారా ఆధారితమైనది. అనేక AI-సెంట్రిక్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్‌ను సులభంగా రిపేర్ చేయవచ్చు, అప్‌గ్రేడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఇంటిగ్రేషన్ కలిగి ఆపరేటింగ్ చాలా సులభతరంగా ఉంటుంది. దేశీయంగా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ టాబ్లెట్‌ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యను మరింత చేరువచేసేలా, రాష్ట్ర ప్రభుత్వాల కోసం మూడు లక్షల టాబ్లెట్‌లను తయారు చేయాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ టాబ్లెట్ విద్యార్థులకు చాలా రకాలుగా సహాయపడుతుంది. BharatGPT వర్చువల్ అసిస్టెంట్‌ ద్వారా వాయిస్ అసిస్టెంట్, వీడియో చాట్ అసిస్టెంట్ కలిగి ఉంటుంది. డిజిటల్ లర్నింగ్ మరింత సులభతరం చేస్తూ.. ఉపన్యాసకులు ఏ భాషలో మాట్లాడినా, వారి మాతృభాషకు అనువాదం చేస్తుంది. ఇందులో రియల్ టైమ్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్ యాప్‌ ఉంటుంది. 8-అంగుళాల 1280x800 IPS HD డిస్‌ప్లే, 3GB/4GB RAM, 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT8766A ప్రాసెసర్వీ, డియో కాల్స్ కోసం 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 5100 mAh బ్యాటరీ సామర్థ్యం, కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ 5.0, Wi-Fi , 4G LTE , BharatGPT పవర్డ్ AI మొదలైనవి ఉన్నాయి.

Post a Comment

0 Comments