స్పెయిన్ లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగనుంది. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులు, వినూత్న టెక్నాలజీలను ప్రదర్శిస్తాయి. అలాగే తాము త్వరలో లాంచ్ చేయనున్న ఉత్పత్తులను కూడా కంపెనీలు ప్రదర్శిస్తాయి.దీనిలో శాంసంగ్, షావోమీ, రియల్మీ, వివో, మోటొరోలా, లెనోవో, ఇన్ఫీనిక్స్, టెక్నో వంటి అనేక టెక్ కంపెనీలు పాల్గొని తమ సరికొత్త స్మార్ట్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. ఇందులో అనేక కంపెనీలు స్మార్ట్ ఫోన్లతో సహా అనేక సాంకేతిక ఉత్పత్తులు లేదా గాడ్జెట్లను ప్రారంభించవచ్చు. స్మార్ట్ ఫోన్ల విషయంలో శాంసంగ్, రియల్మీ, షావోమీ, వివో వంటి కంపెనీలు లాంచ్లో ముందుండే అవకాశం ఉంది. హెచ్పీ, లెనోవో, డెల్, అసుస్ వంటి కంపెనీలు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎందుకంటే గతేడాది ఏఐ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. అనేక టెక్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో ఏఐ ఫీచర్లను చేర్చడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో ఈసారి టెక్నాలజీ మెగా ఈవెంట్లో చాలా కంపెనీలు ఏఐ ఫీచర్లతో ఉత్పత్తులను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఏఐ టెక్నాలజీ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. శాంసంగ్ తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ల సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్లోని మూడు ఫోన్లను ఏఐ ఫీచర్లతో లాంచ్ చేయడం విశేషం. దీనికి కంపెనీ గెలాక్సీ ఏఐ అని పేరు కూడా పెట్టింది. శాంసంగ్ తర్వాత ఒప్పో, వన్ప్లస్ కంపెనీలు కూడా తమ స్మార్ట్ఫోన్ల్లో కొన్నింటిని ఏఐ ఫీచర్లతో తీసుకురానున్నాయి.
0 Comments