ఫైర్ఫాక్స్ బ్రౌజర్ డెవలపర్ అయిన మొజిల్లా పలు ఉత్పత్తుల్లో తన పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నందున, 60 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. "ఫైర్ఫాక్స్లోకి విశ్వసనీయమైన AI"ని తీసుకురావడంపై దృష్టి సారిస్తుందని మొజిల్లా ఒక మెమోలో పేర్కొంది. అలా చేయడానికి, పాకెట్, కంటెంట్, ఫైర్ఫాక్స్ ఆర్గనైజేషన్‌తో కంటెంట్‌కు మద్దతు ఇచ్చే AI/ML టీమ్‌లను ఏకతాటిపైకి తీసుకువస్తుందని టెక్ క్రంచ్ నివేదించింది. ఇందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.
0 Comments