సామాన్యుడికి అందుబాటు ధరలో, మెరుగైన ఫీచర్లు కలిగిన ఫ్రెండ్లీ బడ్జెట్ ఫోన్ ను శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎఫ్15 5జీ ని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీఛర్లు ఉన్నాయని, ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లలో పోల్చితే గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లో కొత్త ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రత్యేకతలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ధర కూడా సామాన్యులకు అందుబాటులో రూ. 15,000 కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ఎన్నో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. నాలుగేళ్ల అప్‌డేట్స్ గ్యారంటీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఓఎస్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను దాదాపు ఐదేళ్ల వరకూ వస్తాయి. ఆండ్రాయిడ్ 18కు ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో 6.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ, మీడియా టెక్ డైమన్‌సిటీ 6100+ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
0 Comments