కంటెంట్‌లో తప్పులను సరిచేసే ఏఐ ప్లాట్‌ఫామ్స్ !


ర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సపోర్ట్‌తో వివిధ రంగాల్లో ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు ఇంట్రడ్యూస్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు ఏఐ టూల్స్ ఎంతో సాయం చేస్తున్నాయి. ఏదైనా విషయం గురించి కంటెంట్‌ రాయడంతో పాటు రాసిన కంటెంట్‌లో తప్పులను సైతం ఇవి గుర్తిస్తున్నాయి. రచయితలు, విద్యార్థులకు సైతం ఇవి ఉపయోగపడుతున్నాయి. కంటెంట్‌ రైటర్లు, క్రియేటర్లకు ఏఐ బేస్డ్ వెబ్‌సైట్లు, టూల్స్‌ బోలెడు ప్రయోజనాలు అందిస్తూ పాపులర్‌ అవుతున్నాయి. ఇవి రైటర్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, అద్భుతమైన కంటెంట్‌ను క్రియేట్‌ చేయడానికి, రీరైట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి.

పారాఫ్రేజ్ ఆన్‌లైన్ : ఇది ఫ్రీ, ఫ్యాన్సీ టూల్‌. కేవలం పదబంధాలను మార్చడమే కాకుండా, విషయాలు మరింత ఆకట్టుకునేలా సెంటన్స్‌లను రాస్తుంది. రైటింగ్స్‌ను సులువుగా చదివేలా క్లిష్టతరం లేకుండా, కచ్చితంగా ఉండేలా అందిస్తుంది.

గూగుల్‌ బార్డ్ : బార్డ్‌ను గూగుల్ రీరైటింగ్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించలేదు. కానీ రీరైటింగ్‌కి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. రాసిన కంటెంట్‌లో తప్పులను ఇది సరిచేయగలదు. ఈ టూల్ చాలా తెలివైనది. మీరు ఫాన్సీ లాంగ్వేజ్‌ ఉపయోగించకపోయినా, మీ రైటింగ్‌కి ఏం కావాలో అర్థం చేసుకుంటుంది. బార్డ్‌తో కంటెంట్‌ను మరింత సులభంగా అర్థమయ్యేలా, వేగంగా అవసరమైన విధంగా మాచ్చుకోవచ్చు.

పారాఫ్రేజర్‌.ఐవో : పారాఫ్రేజర్‌.ఐవో రైటింగ్‌ను ఈజీ చేసేస్తుంది. ఇది సోషల్ మీడియా పోస్ట్‌లు లేదా కాలేజీ అసైన్‌మెంట్‌ల వంటి అన్ని రకాల రైటింగ్స్‌ చేయగలదు, కంటెంట్‌ను క్రియేట్ చేయగలదు. దీని రైటింగ్స్‌ చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.

ఆర్టికల్ రీరైటర్ : ఆర్టికల్ రీరైటర్ కంటెంట్ మెటీరియల్‌ను అనేక టూల్స్‌తో అద్భుతంగా మారుస్తుంది. ఇది వర్డ్ ఛేంజర్, సెంటెన్స్ రీరైటర్, ప్లాగియారిజం రిమూవర్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ మీ రైటింగ్ సరైనదని, ఇతర లొకేషన్‌ల నుంచి ఎలాంటి కాపీ కంటెంట్ కలిగి లేదని నిర్ధారించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చక్కగా, త్వరగా రాయాల్సిన అవసరాలు ఉన్న వారికి బాగుంటుంది.

క్విల్‌బాట్ : కంటెంట్‌ను అర్థం చేసుకోవడం, రైటింగ్‌ని ఛేంజ్‌ చేయడంలో బెస్ట్‌ రిజల్ట్‌ ఇస్తుంది. మీకు పదబంధ ప్రత్యామ్నాయాలను అందించేటప్పుడు, ఒరిజినల్‌ టెక్స్ట్‌ కంటెంట్‌ కాంటెంక్స్ట్‌ కొనసాగించడానికి నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుంది. బాగా నచ్చిన పదబంధాలను ఎంచుకునే సౌలభ్యం ఉంది కాబట్టి, రైటింగ్ చక్కగా అనిపిస్తుంది, రీడర్లకు మంచి అనుభూతి కలుగుతుంది. వీటితో పాటు అనేక ఇతర ఆన్‌లైన్ టూల్స్ కూడా కంటెంట్ రైటర్లు, రచయితలు, విద్యార్థులు, లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్‌కు మంచి సేవలను ఉచితంగా అందిస్తున్నాయి.

Post a Comment

0 Comments