స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఒప్పో తన కొత్త ప్రోడక్ట్ ను ఆవిష్కరించింది. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న అగ్యుమెంట్ రియాలిటీ గ్లాస్ ప్రోటో టైప్ ను ఒప్పో ఈ ఈవెంట్ నుండి ఆవిష్కరించింది.  ఈ కొత్త AR కళ్ళజోడు ఎయిర్ గ్లాస్ 3 చాలా అందమైన లుక్స్ తో కనిపిస్తోంది మరియు సాధారణ కళ్ళ జోడు మాదిరిగా అందించింది. ఈ ఎయిర్ గ్లాస్ 3 ని కళ్ళకు ధరించగానే ఒప్పో ఎయిర్ గ్లాస్ అని ఓపెన్ అవుతుంది. బ్యాటరీ వివరాలను చూపిస్తుంది. ఈ ఎయిర్ గ్లాస్ 3 ని ఒప్పో యాప్ తో కనెక్ట్ చేయగానే వెంటనే ఈ AR కళ్ళజోడు తన పని మొదలు పెడుతుంది. ఈ గ్లాస్ స్క్రీన్ పైన అన్ని వివరాలను కూడా చూపిస్తుంది.  ఒప్పో అగ్యుమెంట్ రియాలిటీ గ్లాస్ వాయిస్ అసిస్టెంట్ తో నేరుగా పని చేస్తుంది. ఈ కళ్లజోడుకు అందించిన ప్రశ్నలకు వెంటనే జవాబులను గ్లాస్ స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇది AndesGPT అని పిలవబడే ఒప్పో సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పైన నడుస్తుంది. అయితే, ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ