గూగుల్ పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,06,999 గా ఉంది. అదే 256GB వేరియంట్ ధర రూ.1,13,999 గా ఉంది. అయితే కొన్ని పిన్‌కోడ్‌లలో ఈ మోడల్ అందుబాటులో లేదని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఒబ్సిడియన్, బే రంగుల్లో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.15,000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన మోడళ్లపై రూ.15000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 2400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది. దీంతోపాటు Tensor G3 CPU మరియు టైటాన్ M2 మరో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 30W వైరడ్, 23W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5050mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 7 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లను ఇస్తామని గూగుల్ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. అలాగే 10.5 సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్టుతో వచ్చింది. జనవరి 25న పిక్సల్ 8 మింట్ గ్రీన్ కలర్ విడుదల అయింది. 8GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.75,999 గా ఉంది. గూగుల్ పిక్సల్ 8 స్మా్ర్ట్‌ఫోన్ 129Hz రీఫ్రెష్ రేట్‌తో 6.2 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత క్లీన్ OSపైన పనిచేస్తుంది. 7 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్ 8 సోనీ IMX386 సెన్సార్, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 10.5MP కెమెరాను అమర్చారు. 27W వైరడ్ ఛార్జింగ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4,575mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ వైఫై 6, బ్లూటూత్ 5.3, NFC మరియు USB-C మరియు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి.
0 Comments