ఆల్ఫాబెట్‌ను అధిగమించిన 'ఎన్‌విడియా' !


కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే ప్రాసెసర్లు తయారు చేసే అమెరికన్ కంపెనీ 'ఎన్‌విడియా' మార్కెట్ విలువ రూ.16వేల కోట్లకు చేరుకుంది. ఇంతకుముందు అమెరికాలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, యాపిల్ మాత్రమే ఇంతటి రికార్డును సాధించాయి. 'ఎన్‌విడియా' కంపెనీ షేర్ల విలువ 2023లో మూడు రెట్లు పెరిగాయి. షేర్ల ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 శాతానికి మించి పెరిగాయి. శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిటన్లు తయా చేయడం ద్వారా చిప్స్ తయారీ రంగంలో రారాజులా ఎన్‌విడియా వెలుగొందుతోంది. గణాంకాలను చాలా వేగంగా లెక్కించగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ఎన్‌విడియా తయారు చేస్తోంది. ఈ ప్రాసెసర్లను ఎక్కువగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో వీటి విలువ ఒక్కొక్కటి వేల డాలర్లు పలుకుతోంది. ఈ ప్రాసెసర్లకు గిరాకీ ఏ విధంగా ఉందంటే, వాటిని వజ్రాలను తరలించినట్లుగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రక్కుల్లో తరలిస్తున్నారు. గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ల తయారీలో 80 శాతం మార్కెట్‌ను సంపాదించుకున్న ఇంటెల్, ఏఎండీ కంటే ఎన్‌విడియా అవకాశాలు పెరుగుతున్నాయి.

Post a Comment

0 Comments