గత డిసెంబర్‌లో కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 119 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ సంస్థల సబ్‌స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్ తెలిపింది. బ్రాడ్ బాండ్ సబ్‌స్క్రైబర్ల బేస్ స్వల్పంగా పెరిగి 90.4 కోట్లకు చేరుకున్నది. మొత్తం సబ్‌స్క్రైబర్ల బేస్‌లో సుమారు 76 శాతం అని ట్రాయ్ తెలిపింది. నవంబర్ నుంచి డిసెంబర్ నాటికి 1,185.73 మిలియన్ల నుంచి 1,190.33 మిలియన్లకు కొత్త టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. నెలవారీగా 0.39 శాతం గ్రోత్ నమోదైందని ట్రాయ్ తెలిపింది. రిలయన్స్ జియో 39.94 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్ 18.5 లక్షల సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా 13.68 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4,420 సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య డిసెంబర్‌లో 3.15 కోట్ల నుంచి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్లలో రిలయన్స్ జియో కొత్తగా 2.46 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్ 82,317, వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్లు 9,656, క్వాడ్రంట్ 6,926 మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250, టాటా టెలీ సర్వీసెస్ 22,628, ఎంటీఎన్ఎల్ 11,325, ఏపీఎస్ఎఫ్ఎల్ 1,214, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 627 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. వైర్‌లెస్ కనెక్షన్లలో బ్రాడ్‌బాండ్ సెగ్మెంట్ స్వల్పంగా పెరిగి 85.79 కోట్ల నుంచి 86.52 కోట్లకు పెరిగింది. వైర్‌లెస్ బ్రాడ్ బాండ్ కనెక్షన్లు 1.46 శాతం పెరిగి 3.83 కోట్లకు పెరిగాయి. మొత్తం సబ్‌స్క్రైబర్లలో టాప్ 65 సర్వీస్ ప్రొవైడర్లకు 98.35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. రిలయన్స్ జియో 470.19 మిలియన్లు, భారతీ ఎయిర్‌టెల్ 264.76 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 127.29 మిలియన్ డాలర్లు, బీఎస్ఎన్ఎల్ 25.12 మిలియన్, అర్టియా కన్వర్జెన్స్ 2.23 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్నాయని ట్రాయ్ వెల్లడించింది.
0 Comments