దేశీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ నుంచి బుల్లెట్ ప్రూఫ్ సెడాన్ కారు !


ర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇప్పుడు నేరుగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ ఆర్మర్డ్ కార్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. తమ బ్రాండ్ నుంచి ఇండియాలో మంచి సేల్స్ జరుగుతున్న బీఎండబ్ల్యూ 7 సిరీస్ సెడాన్‌ కార్లలో ఈ తరహా రక్షణ వ్యవస్థను అందిస్తుంది. దేశాధినేతలు, ప్రధాన మంత్రులు, విదేశీ ప్రముఖులు, CEOలు, MDలు, మల్టీ-బిలియనీర్లు, బహుళ జాతి కార్పోరేట్ కంపెనీ డైరెక్టర్‌లు మొదలైన వారి కోసం ఈ లిమోసిన్ రూపొందించారు. ఇది వీఐపీల భద్రత అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది. ఈ బీఎండబ్ల్యూ సాయుధ కారు మెర్సిడెస్-బెంజ్ గార్డ్‌కు ప్రత్యర్థి. బీఎండబ్ల్యూ షేర్ చేసిన వివరాల ప్రకారం, తాజాగా ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ 7 సిరీస్ ప్రొటెక్షన్ మోడల్ కారు, VR9 రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది ప్రత్యేకమైన స్వీయ-రక్షణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కవచం ఆర్మర్ స్టీల్‌తో తయారు చేయబడి ఉంటుంది, అండర్ బాడీ కోసం అదనపు కవచం, ఆర్మర్డ్ గ్లాస్ ఉన్నాయి. ఇది బుల్లెట్లు, పేలుడు పదార్థాలు, డ్రోన్‌ దాడులు, బాలిస్టిక్ క్షిపణుల దాడులను సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఎలాంటి రసాయన దాడుల నుంచి కూడా ఇందులోని ప్రయాణీకులకు ఎలాంటి హాని కలగకుండా గొప్ప భద్రతను అందిస్తుంది. దాడులను తట్టుకునేందుకు దీని చట్రం 10 mm మందపాటి ఉక్కుతో అందిస్తున్నారు. అదనంగా 72 మిమీ మందపాటి మల్టీలేయర్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా అమర్చబడి ఉంటుంది. ఈ సాయుధ సెడాన్ తలుపులు మోటరైజ్డ్ ఆధారితమైనవి. ఇవి ఒక్కొక్కటి 200 కిలోల బరువును కలిగి ఉంటాయి. బుల్లెట్ తగలకుండా ప్రత్యేక కేసింగ్, ఇంధన ట్యాంక్ కూడా ఉంది. దీని టైర్లు కూడా చాలా దృఢంగా ఉంటాయి. అనుకోని పరిస్థితులలో ఈ వాహనం టైర్‌ పంక్చర్ అయితే, ఫ్లాట్ టైరుతోనే సగటున 80 కి.మీ వేగంతో 30 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది కాకుండా, ఈ సెడాన్‌లో నాలుగు డోర్ల నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అమర్చబడ్డాయి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి కారు నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి. BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 4.4-లీటర్ 8-సిలిండర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో ఆధారితమైనది. దీని పవర్‌ట్రెయిన్ 524 BHP శక్తిని, 750 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బరువు అధికంగా ఉన్నప్పటికీ ఇది కేవలం 6.6 సెకన్లలోనే 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 210 km వేగంతో దూసుకెళ్లగలదు. సాధారణంగా BMW 7 సిరీస్ లో స్టాండర్డ్ మోడల్ సెడాన్ కారు రూ. 1.70 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు తాము కోరుకునే ఫీచర్లను కస్టమైజ్ చేసుకునే దానిని బట్టి ఖరీదు పెరుగుతుంది. కాబట్టి కొత్తగా విడుదల చేసిన BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ కారు ధర ఎంత అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఎంచుకునే ఫీచర్ల ఆధారంగా సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 9 కోట్ల వరకు ధరలు ఉంటాయని అంచనా.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains