మార్చి 5న నథింగ్‌ ఫోన్‌ 2ఏ విడుదల !


దేశీయ మార్కెట్లోకి మార్చి 5న తొలిసారి మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. రూ. 30 వేలలోపే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఫ్రంట్‌లో పంచ్ హోల్ కటౌట్ ఇవ్వనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్, 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో తీసుకురానున్నారు. 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించనున్నారు. కనెక్టివీటీ విషయానికొస్తే.. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూ టూత్, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org