మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 సదస్సులో శాంసంగ్ తన గెలాక్సీ రింగ్‌ను ఆవిష్కరించింది. అయితే తాము కూడా స్మార్ట్ రింగ్‌ను తయారీ చేస్తున్నట్లు హానర్ సంస్థ వెల్లడించింది. ప్రధానంగా ఈ స్మార్ట్ రింగ్ యూజర్ల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుందని పేర్కొంది. భవిష్యత్‌తో ఈ హానర్ స్మార్ట్ రింగ్ అందుబాటులోకి వస్తుందని సంస్థ సీఈవో జార్జ్ జాహా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని ఆరోగ్యపరమైన సలహాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత యాప్‌ల ద్వారా మెరుగైన సలహాలు సూచనలు అందుతాయని తెలిపారు. అలవాట్లు మరియు ఆరోగ్య సమాచారం ఆధారంగా సలహాలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం తొలిరోజుల్లో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ సంస్థ స్మార్ట్ రింగ్‌పైన ప్రకటన చేసింది. తాజాగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 సదస్సులో ఈ గెలాక్సీ రింగ్‌ను ఆవిష్కరించింది. ఈ రింగ్ అనేక సెన్సార్లను కలిగి ఉంటుందని పేర్కొంది. మరియు హార్ట్ రేట్ వంటి హెల్త్ ట్రాకర్లతో వస్తుంది. కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ కూడా ఈ తరహా స్మార్ట్ రింగ్‌ను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆపిల్ రింగ్ ఆలోచన దశలోనే ఉన్నట్లు సమాచారం. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి, కేలరీల ఖర్చు వంటి ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకర్లను కలిగి ఉంటుందని సమాచారం.
0 Comments