Ad Code

చంద్రునిపై సురక్షితంగా వాలిన 'ఒడిస్సియస్' !


మెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా నడిచే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్‌ట్యూటివ్ మెషిన్స్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన లూనార్ ల్యాండర్ 'ఒడిస్సియస్' చంద్రునిపై సురక్షితంగా వాలింది. 1972లో అపోలో మిషన్‌ పేరుతో నాసా చేపట్టిన చంద్ర మండల యాత్ర తర్వాత ఇదే అమెరికా ఖాతాలో తొలి మూన్‌ మిషన్‌ విక్టరీ. నాసా ఇచ్చిన 118 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌తో ఒడిస్సియస్‌ను చంద్రుడిమీదకు పంపింది. అమెరికన్ టైమ్ ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుఝామున 4 గంటల 53 నిమిషాలకు క్షేమంగా జాబిలిపై వాలి అయ్యామ్ సేఫ్ అని సంకేతాలిచ్చింది 'ఒడిస్సియస్' ఒడిస్సియన్‌ కాలుమోపిన బిలం పేరు మాలాపెల్ట్ A. చంద్రుడి సౌత్‌పోల్‌కి 300 కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ చిన్న గొయ్యి. దక్షిణ ధ్రువానికి అత్యంత చేరువలో దిగిన వ్యోమనౌకగా చరిత్రకెక్కింది ఒడిస్సియన్‌. ఈవిధంగా చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ రికార్డును బద్దలుకొట్టేసింది. 100 కిలోల బరువులో సిలిండర్ ఆకారంతో టెలిఫోన్ బూత్‌ని పోలిన ఒడిస్సియస్ ఐదు నాసా పరికరాల్ని, మరికొన్ని వాణిజ్య సంస్థలకు చెందిన పేలోడ్స్‌ని మోసుకెళ్లింది. జపాన్ స్లిమ్ ల్యాండర్‌లా తలకిందులుగా కాకుండా నిటారుగానే దిగిందని, డేటా పంపడం కూడా మొదలైందని ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ కన్‌ఫమ్ చేసింది. కానీ.. ల్యాండింగ్‌ సమయంలో ఒడిస్సియస్ బాగా తడబడింది. ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తి మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సైంటిస్టుల్ని కలవరపెట్టింది. కానీ, సమయస్పూర్తితో ట్రబుల్ షూట్ చేయడంతో నిర్దేశిత సమయం కంటే కొంత ఆలస్యంగానైనా సురక్షితంగానే ల్యాండైంది. నాసా తయారుచేసిన డాప్లర్ లిడార్ అనే ఒక స్పెషల్ పేలోడ్‌దే ఇక్కడ కీలకపాత్ర. దాని సహకారం వల్లే సేఫ్‌ల్యాండింగ్ సాధ్యమైంది. ఇందులోని రెండు లేజర్స్‌ సాయంతో ల్యాండర్‌లో పనిచేయని భాగాన్ని ఇన్‌ట్యూటివ్ ఇంజనీర్లు ఉత్తేజపరిచారు. ఈవిధంగా ఒడిస్సియస్‌ను మళ్లీ వర్క్‌మోడ్‌లోకి తీసుకొచ్చింది, తాజా మూన్ మిషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా మార్చింది నాసా వారి ప్రత్యేక పరికరం. యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై పడ్డ అగ్రరాజ్యపు ముద్ర శాశ్వతమా కాదా తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఒడిస్సియస్‌ లైఫ్‌టైమ్ ఏడు రోజులే. ల్యాండింగ్ సమయంలో జరిగిన గడబిడ ల్యాండింగ్ తర్వాత బలహీన సిగ్నల్స్‌ ఇవన్నీ కలిపి ల్యాండర్ ఫ్యూచర్‌పై కన్‌ఫ్యూజన్ పెంచేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu