రేపటి నుంచి రెడ్మి ఎ3 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు !


షియోమి గత వారంలో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన రెడ్మి ఎ3 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం నుండి సేల్ కి రానున్నది. రెడ్మి ఎ3 స్మార్ట్ ఫోన్ ను రూ. 7,299 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ 3 GB RAM + 64 GB ROM వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ 4 GB RAM + 128 GB ROM వేరియంట్ కోసం రూ. 8,299 మరియు ఈ ఫోన్ 6 GB RAM + 128 GB ROM హై ఎండ్ వేరియంట్  రూ. 9,299 రూపాయలు. కొత్త ప్రీమియం హేలో డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.71 ఇంచ్ డిస్ప్లేని Gorilla Glass 3 ప్రొటెక్షన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో Mediatek Helio G36 ప్రోసెసర్ మరియు 6GB RAM సపోర్ట్ వుంది. ఈ ఫోన్ ను 128 GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 1 TB ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది. రెడ్మి ఎ3 లో వెనుక 8MP డ్యూయల్ రియర్ కేమెరా సేతువు మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను ఎక్కువ కాలం నడిపించ గల 5000 mAh బిగ్ బ్యాటరీ ను కూడా ఈ ఫోన్ లో అందించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org