Ad Code

థ్రెడ్స్‌ యాప్‌ లో "టుడేస్ టాప్ టాపిక్స్" ?


మెటా సంస్థ గత సంవత్సరం ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ (X) పోటీగా థ్రెడ్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. ప్రారంభంలో అత్యధిక డౌన్‌లోడ్‌లు కలిగిన యాప్‌గా రికార్డు సృష్టించిన థ్రెడ్స్‌ ప్లాట్‌ఫాం కొన్ని రోజుల్లోనే వినియోగదారులను క్రమంగా కోల్పోయింది. దాంతో మెటా సంస్థ కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మెటా సంస్థ థ్రెడ్స్‌లో అనేక కీలక ఫీచర్లను లాంచ్‌ చేస్తోంది. తాజాగా థ్రెడ్స్‌ యాప్‌ కొత్త ఫీచర్‌ గురించి మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కీలక పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌లోని ట్రెండింగ్‌ ఫీచర్‌ తరహాలో థ్రెడ్‌లోనూ కొత్త ఫీచర్‌ను త్వరలో టెస్టింగ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. థ్రెడ్స్‌ యూజర్లు ఎక్కువగా సెర్చ్‌ లేదా పోస్టు చేసిన టాపిక్‌లు అందులో కనిపిస్తాయని చెప్పారు. థ్రెడ్స్‌లో "టుడేస్ టాప్ టాపిక్స్" పేరుతో సెర్చ్‌ పేజీ మరియు ఫర్‌ యూ ఫీడ్‌లో కనిపిస్తుందని తెలిపారు. ఈ ఫీచర్‌ ద్వారా థ్రెడ్స్‌ యూజర్లు ప్రస్తుతం ఏ విషయంపై చర్చించుకుంటున్నారనేది తెలుస్తుంది. తొలుత థ్రెడ్స్‌ కొత్త ఫీచర్‌ను అమెరికాలో త్వరలో టెస్టింగ్‌ చేయనున్నట్లు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు. వినియోగదారులకు ట్రెండింగ్‌ అంశాలతో కనెక్ట్‌ అయ్యే ఈ 'టుడేస్ టాప్ టాపిక్స్' ఫీచర్‌ను తొలిదశలో చిన్న స్థాయిలో టెస్టింగ్‌ చేస్తామన్నారు. ఈ థ్రెడ్స్‌ కొత్త ఫీచర్‌పై ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌ ఆడస్‌ మోస్సేరీ కీలక వివరాలు వెల్లడించారు. యూజర్ల ఎంగేజ్‌మెంట్‌ ను తెలుసుకొనేందుకు లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌ను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ఆల్గారిథమ్‌ ద్వారా ఒక ప్రత్యేకమైన అంశంపై ఎంత మంది యూజర్లు మాట్లాడుకుంటున్నారు. మరియు ఎంతమంది ఆయా పోస్టులపై స్పందిస్తున్నారనేది తెలుసుకుంటామన్నారు. ఈ కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు మెటాలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని తెలిపారు. ఆ బృందం సదరు అంశాలు కంటెంట్‌ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా నకిలీ వార్తలకు సంబంధించిన అంశాలా లేదా తప్పుదోవ పట్టించే అంశాలా అనే దానిని నిర్ధారిస్తాయి. దీంతోపాటు యూజర్లు కూడా సమస్యాత్మాక కంటెంట్‌పై ఫిర్యాదు చేయవచ్చని ఆడమ్‌ మోస్సేరి తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu