ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే తొలగించండి !


మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌ యాప్స్‌ వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి కొన్ని యాప్స్‌ను గుర్తించారు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఈఎస్‌ఈటీ అనే మాల్వేర్‌ ప్రొటెక్షన్‌ కంపెనీ ఇలాంటి 12 డేంజర్‌ యాపల్‌లను గుర్తించింది. ఈ యాప్‌ల ద్వారా డేటా గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ యాప్‌లన్నీ మెసేజింగ్ టూల్స్‌గా పనిచేస్తున్నాయి. ఈ యాప్‌లన్నీ రహస్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో VajraSpy అనే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ కోడ్‌ని ఉపయోగించాయి. ఈ యాప్స్‌ రహస్యంగా స్మార్ట్ ఫోన్‌లోని ఫైల్‌లు, కాల్ లాగ్‌లు, ఎస్‌ఎమ్‌ఎస్‌లను దొంగలిస్తున్నాయి. ఈ యాప్‌లలో కొన్ని యూజర్‌ల వాట్సాప్‌ డేటాను సైతం దోచేస్తున్నారు. అంతే కాకుండా సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, కెమెరాలతో ఫొటోలు తీయడం వంటి పనులు కూడా ఈ యాప్స్ సాయంతో చేస్తుంటారు. ఈ స్పై యాప్స్‌ ఇవే.. హలో చాట్, చిట్ చాట్, మీట్ మీ, నిడస్, రఫాకత్ న్యూస్, వేవ్ చాట్, ప్రైవ్ టాక్, గ్లో గ్లో, లెట్స్ చాట్, క్విక్ చాట్, యోహో టాక్ వంటి యాప్స్‌ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ప్పటికే తొలగించారు. ఒకవేళ ఎవరి ఫోన్‌లో అయినా ఈ యాప్స్‌ ఉంటే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. హానిట్రాప్‌ వంటి వ్యవహారాలకు ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్లు భద్రతా పరిశోధన సంస్థ భావిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్‌ వచ్చినా, మెసేజ్‌లు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org