మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో గూగుల్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌లను ప్రకటించింది. గూగుల్ మెసేజ్‌లను టెక్ట్స్ ద్వారా ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి వినియోగిస్తుంటారు. అయితే అందులో జెమిని యాక్సెస్ చేసే అప్‌డేట్‌ను గూగుల్ అందిస్తుంది. దాంతో టెక్ట్స్ ఫార్మాట్‌లో ఏదైనా విషయాన్ని చెబితే ఫొటోలు, వీడీయోల రూపంలో ఇతరులకు సందేశాలు వెళ్లే అవకాశం ఉంది. ఇది జనరేటివ్ ఏఐ ద్వారా ఎల్‌ఎల్‌ఎంలను ఉపయోగించుకుంటూ స్పందిస్తుంది. ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్ సిస్టమ్ కారు ఆటో డ్రైవింగ్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఆ సందర్భంలో ఏదైనా టెక్ట్స్ మెసేజ్ వస్తే కొంత ప్రయాణంలో అంతరాయం కలగొచ్చు. దాంతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించేందుకు వాట్సప్ వంటి అధికంగా వినియోగిస్తున్న యాప్‌ల్లో ఇతరులు పంపించే మెసేజ్‌లకు తగ్గట్టు స్పందించేలా ఏఐ సహాయంతో ప్రిడిఫైన్డ్ రిప్లైలు జనరేట్ అవుతాయి. కళ్లు సరిగా కనిపించని, దృష్టిలోపం ఉన్నవారు మెబైల్ ఫోన్ వినియోగించేలా గూగుల్ చర్యలు చేపట్టింది. వారికి గూగుల్ లుక్‌అవుట్ ద్వారా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో ఏదైనా ప్రదేశానికి వెళితే అక్కడి ప్రదేశాలు, డైరెక్షన్లు, ఇతర వివరాలను వాయిస్ రూపంలో జనరేటివ్ ఏఐ సహాయంతో వినియోగదారులకు అందిస్తుంది. గూగుల్ డాక్స్‌లో చిన్న కామెంట్లను ఉపయోగించి పూర్తి నోట్‌ను రాయలేము. కానీ కొత్త పీచర్‌తో మార్కప్ టూల్‌ను వినియోగించి అనోటేషన్ల ద్వారా గూగుల్ డాక్యుమెంట్‌ను తయారుచేయవచ్చు. మొబైల్ లాక్‌లో ఉన్నప్పుడు యూట్యూబ్ మ్యూజిక్‌ను అపరేట్ చేసే అవకాశం ఉంటుంది. అదే లాక్‌స్క్రీన్‌లో స్పాటిఫై యాప్‌ను ఆపరేట్ చేసేలా గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
0 Comments