మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇటీవల జపనీస్ కత్తి మాస్టర్ అకిహిరా కోకాజీ నుంచి కత్తి తయారీ పాఠాన్ని నేర్చుకున్నారు. పదునుకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జపనీస్ కత్తి 'కటనా'ను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జుకర్‌బర్గ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేశారు. చిత్రంలో తాను తయారు చేసిన కత్తిని చూపించాడు. అలాగే కత్తి తయారు చేస్తున్న వీడియోను, తయారు చేసిన కత్తిని వాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. "మాస్టర్ అకిహిరా కోకాజీతో కటనాల తయారీ గురించి నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. మీ (అకిహిరా కోకాజీ) కళా నైపుణ్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!" అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. షేర్ చేసినప్పటి నుంచి 3.6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. "తయారు చేసిన కటానాను మీతోనే ఉంచుకుంటారా?" అని ఓ యూజర్ ప్రశ్నించారు. "మీరు నిజమైన నింజాగా మారే మార్గంలో ఉన్నారు. చేతులతో యుద్ధంలో ఆరితేరాక కత్తులపై దృష్టిపెట్టారు!" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
0 Comments