దేశీయ మార్కెట్లో వివో కొత్త వివో వై200ఇ 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 20 వేల రూపాయలలో టాప్ క్లాస్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది. 20 వేల రూపాయల ధరలో భారత మార్కెట్ లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ కాంపీటీషన్ ను తట్టుకునేలా ఈ ఫోన్ ను వివో లాంఛ్ చేసింది. 6GB, 8GB రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 6GB+128GB వేరియంట్ ను రూ. 19,999 ధరతో మరియు 8GB+128GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Prebook ఆర్డర్స్ ఈ రోజు వివో నుండే మొదలుపెట్టింది. ఈ ఫోన్ ను vivo.com మరియు Flipkart నుండి ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లో In-display ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది. క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 ప్రోసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ Funtouch OS 14 సాఫ్ట్ వేర్ పైన లేటెస్ట్ Android OS తో పని చేస్తుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ బడ్జెట్ 4nm ప్రోసెసర్ మరియు ఈ బడ్జెట్ కేటగిరిలో ఫాస్ట్ గా ఉంటుంది.
0 Comments