ట్రూకాలర్ తరహాలో గూగుల్ కొత్త టూల్ లుక్ అప్ ?
గూగుల్ కూడా ట్రూకాలర్ తరహా ఫీచర్‌పైన పనిచేస్తోందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌లో త్వరలో లుక్ అప్ అనే కొత్త టూల్ రానుందని తెలుస్తోంది. ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ల నుంచి మెసేజ్, కాల్ వచ్చినప్పుడు ఈ గూగుల్ కొత్త టూల్ లుక్ అప్ వారి వివరాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్ 127.0.620688474 లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ గూగుల్ లుక్ అప్ టూల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని వివరాలు వెల్లడి కాలేదు. జూన్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ గూగుల్ కొత్త టూల్ అందుబాటులోకి వస్తే ట్రూకాలర్ యాప్ పై భారీ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ట్రూకాలర్ క్లౌడ్ సోర్స్ ఆధారిత వివరాలను అందిస్తోంది. గూగుల్ కొత్త టూల్ దేని ఆధారంగా కాలర్ వివరాలను వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 2024 లో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి సిఫార్సులు చేసింది. ఎవరు ఫోన్ చేసిన వారి పేరు మొబైల్ డిస్‌ప్లేపైన కనిపించేలా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సప్లిమెంటరీ సర్వీసులను అన్ని టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ట్రాయ్ సిఫార్సు చేసింది.