పబ్లిక్ వైఫైను వినియోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై కేంద్ర ప్రభుత్వం సైబర్ టెక్నాలజీ ఏజెన్సీ కీలక సూచనలు చేసింది. సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Cert-in) ఇందుకు సంబంధించి X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. దీని ఆధారంగా షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, హోటళ్లలు సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ వైఫై ని వినియోగించే ముందు వైఫై పేరు సహా ఇతర వివరాలను అక్కడున్న సిబ్బంది ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. అదనపు భద్రత కోసం వైఫై సెట్టింగ్స్‌లోని ఆటో కనెక్ట్ ఆప్షన్ ఆఫ్ చేయడం ఉత్తమం. దీంతోపాటు ఎక్కువగా పబ్లిక్ వైఫై ని వినియోగిస్తున్న వారు ఫోన్‌లోని యాంటీ వైరస్‌ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మెరుగైన భద్రతను పొందవచ్చు. లేకుంటే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా ఓపెన్ నెట్ వర్క్ లేదా పబ్లిక్ వైఫైని వినియోగిస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు బ్యాంకు లావాదేవీలు నిర్వహించకపోవడం ఉత్తమం మరియు సున్నితమైన సమాచారాన్ని వెబ్ సైట్‌లలో నమోదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ వైఫైను ఉపయోగించాలి. వైఫై ద్వారా మీ పరికరాల్లోకి మాల్ వేర్‌ను పంపి, నేరగాళ్ల నియంత్రణలోకి తీసుకొనే అవకాశం ఉంది.
0 Comments