దేశీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ విడుదల అయింది. దీని ధర రూ 19,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో స్పెషిఫికేషన్లు, చిన్న తేడాలతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో, ప్రో ప్లస్ అనే రెండు మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీ, 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందించే దేశంలోనే అత్యంత చౌకైన ఫోన్‌లుగా చెప్పవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ.21,999 ప్రారంభ ధరతో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 24,999 ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 2వేలు తగ్గింపు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధరను రూ.19,999కి తగ్గిస్తుంది. ఈ 5జీ ఫోన్ అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. లాంచ్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో కొనుగోలుదారులకు కంపెనీ రూ.4,999 విలువైన మ్యాగ్‌కిట్‌ను ఉచితంగా అందిస్తోంది. మ్యాగ్‌కిట్‌లో మ్యాగ్ కేస్, మ్యాగ్ పవర్ ఛార్జర్ (3020mAh పవర్ బ్యాంక్) ఉన్నాయి. కంపెనీ మ్యాగ్ ప్యాడ్ (15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జర్)ని కూడా అందిస్తోంది. అయితే, దీన్ని మాత్రం విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
0 Comments