ఆండ్రాయిడ్‌ యూజర్లకు ట్రూకాలర్ వెబ్‌ సర్వీసుల ప్రారంభం !


ట్రూకాలర్‌ వెబ్ సర్వీసులను ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మరింత సౌకర్యవంతంగా, భద్రతను అందించేందుకు ఈ సర్వీసులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని విండోస్‌, మ్యాక్ బ్రౌజర్లలోనూ ట్రూకాలర్ వెబ్‌ పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా మెసెజ్‌లను సెండ్, రిసీవ్‌ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఫోన్‌ నంబర్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఫోన్‌ నంబర్‌ను లింక్ చేశాక.. ట్రూకాలర్ వినియోగదారుల బిజినెస్‌ మెసెజ్‌లు, ఇన్‌స్టంట్‌ మెసేజ్‌లు, SMS మెసేజ్‌లను చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు 100MB వరకు డేటాను బదిలీ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇన్‌కమింగ్‌ కాల్‌, మెసెజ్‌ల నోటిఫికేషన్లను పొందవచ్చు. మొబైల్‌ యాప్‌ తరహాలో ఎటువంటి మెసేజ్‌ల యాక్సెస్‌ ట్రూకాలర్‌ కలిగి ఉండదని తెలిపింది. మరియు డెస్క్‌టాప్‌ వెర్షన్‌ మెరుగైన భద్రతను కలిగి ఉంటుందని ట్రూకాలర్ చీఫ్‌ ప్రొడక్ట్ ఆఫీసర్‌ మరియు ఎండీ రిషిత్‌ తెలిపారు. ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ట్రూకాలర్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి అనంతరం మెసెజెస్‌ ట్యాబ్‌ పైన ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి, మెసేజింగ్‌ ఫర్‌ వెబ్‌ ను ఎంచుకోవాలి. అనంతరం ఏదైనా బ్రౌజర్‌లో www.truecaller.com లోకి వెళ్లి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.

Post a Comment

0 Comments