వన్‌ప్లస్ 11 ఫోన్‌పై వన్‌ప్లస్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 56,999కి లాంచ్ చేసింది. అయితే ఆ తర్వాత వన్‌ప్లస్ ఈ ఫోన్‌పై రూ. 2000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇక తాజాగా మరోసారి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్‌పై తాజాగా కంపెనీ మరో రూ. 3000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్‌పసై మొత్తంగా రూ. 5000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు. దీనిపై పలు బ్యాంక్‌లు సైతం ఆఫర్లను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 48,999కే సైతం చేసుకోవచ్చు. వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌ను గరిష్టంగా రూ. 5000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. వన్‌ప్లస్ 11 స్మార్ట్ ఫోన్‌పై ఇన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ+ ఈ4 డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ కేవలం 25 నిమిషాల్లోనే వంద శాతం బ్యాటరీ పూర్తవుతుంది.
0 Comments