టెలిగ్రామ్ యాప్ ఏడాదిలోపు 1 బిలియన్ యాక్టివ్ యూజర్లను సంపాదిస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాప్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. దుబాయ్‌లో టెలిగ్రామ్ యాప్ సబ్‌స్క్రైబర్లు వేగంగా పెరుగుతున్నారని దురోవ్ చెప్పారు. సందేశాలు, కాల్‌లు, ఇతర ఫైల్‌లను పంపడానికి యాప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏడాదిలో ఒక బిలియన్ (100 కోట్లు) నెలవారీ యాక్టివ్ యూజర్ మార్కును అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ యాప్‌లో 90 కోట్ల యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని చెప్పారు. టెలిగ్రామ్ ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకటైన మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ 2 బిలియన్ల(200 కోట్లు) కంటే ఎక్కువ నెలవారీ యాక్లివ్ యాజర్లును కలిగి ఉంది. యాప్ యాజమాన్యం భౌగోళిక రాజకీయాల్లో తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు దురోవ్ స్పష్టతనిచ్చారు. రష్యాలో జన్మించిన ఆయన 2014లో తాను స్థాపించిన కంపెనీలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ రష్యా నుంచి వెళ్లిపోయాడు. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత టెలిగ్రామ్‌ను రెండు ప్రభుత్వాలు విరివిగా వాడడం మొదలుపెట్టాయి. యుద్ధానికి సంబంధించిన చాలా విషయాలు పంచుకోవడానికి దీన్ని వేదికగా మార్చుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని ప్రధాన మీడియా, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు ఇందులో కంటెంట్ ఛానెల్‌లను నిర్వహించారు.
0 Comments