Ad Code

వాట్సాప్ లో ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే సౌకర్యం !

                                       

ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే సౌకర్యం అందుబాటులోకి తేనున్నది. అంటే ఇక ముందు నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా వాట్సాప్ ద్వారా ఇతరులకు డాక్యుమెంట్లు షేర్ చేయొచ్చు. నెట్ వర్క్ లేకున్నా బ్లూటూత్ సాయంతో షేర్ ఇట్, నియర్ బై షేర్ వంటి యాప్స్ ద్వారా ఫోటోలు, సినిమాలు పంపుతారు. ఇదే సేవలు వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్నది. అదే జరిగితే ఫోటోలు, వీడియోలు, కీలక డాక్యుమెంట్లు పంపడానికి మరో యాప్ వాడాల్సిన అవసరం లేదు. అంతే కాదు.. మరింత వేగంగా, సురక్షితంగా డాక్యుమెంట్లను పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగ పడతుంది. వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంట వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫోటోల గ్యాలరీ యాక్సెస్ వంటి పర్మిషన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ వినియోగంలోకి రానున్నది. 

Post a Comment

0 Comments

Close Menu