ఒప్పో నుంచి A3 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తిస్థాయి వాటర్ రెసిస్టెన్స్‌తో రానుంది. 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో, 950 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. దీంతోపాటు అధిక సూర్యకాంతిలోనూ మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఈ ఒప్పో కొత్త హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 8GB, 12GB ర్యామ్, 256GB, 512GB UFS 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 67W క్విక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వైఫై 6, బ్లూటూత్ 5.3 మరియు అనేక సెన్సార్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ అయింది. భారత్‌లో విడుదలపై ఒప్పో సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. చైనాలో ఈ హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది. 8GB ర్యామ్ +128GB స్టోరేజీ, 12GB ర్యామ్ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్లలో విడుదల అయింది.
0 Comments