Ad Code

దేశీయ మార్కెట్లో 15న రియల్‌మి పీ1 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల !


రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఇటీవలే రియల్‌మి 12X 5G స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. త్వరలోనే మరో కొత్త సిరీస్‌ రియల్‌మి పీ1 5జీ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రియల్‌మి P1 5G మరియు P1 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌లు ఉండనున్నాయి. ఈ హ్యాండ్‌ సెట్‌లకు సంబంధించిన కొన్ని ఫీచర్లను సంస్థ వెల్లడించింది. కేవలం భారత్‌ మార్కెట్‌ కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో ఈ రెండు హ్యాండ్‌ సెట్‌లు కనిపిస్తున్నాయి. ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.15,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే : ఈ ధర సెగ్మెంట్‌లో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే మరియు 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని రియల్‌మి తెలిపింది. TUV Rhenland eye Protection సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. P1 5G స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెవెన్ లేయర్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2160 PWM డిమ్మింగ్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైటెనెస్‌ మరియు ProXDR సపోర్టు, TUV సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రో మోడల్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌ సెట్‌ను కలిగి ఉంటుంది. 45W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి ప్రో మోడల్‌ మెరుగైన ఫీచర్లను కూడా కలిగి ఉండనుంది. టెక్టైల్‌ ఇంజిన్‌ మరియు రెయిన్‌ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ సహా మరిన్ని ఫీచర్‌లతో లాంచ్‌ కానుంది. తడి చేతులతో కూడా టచ్‌ పనిచేసేలా ఈ ఫీచర్‌ వినియోగపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu