Ad Code

భారత్‌లో ఓపెన్‌ ఏఐకి తొలి ఉద్యోగి ప్రగ్యా మిశ్రా?


భారత్‌లో ఓపెన్‌ఏఐ  తొలి నియామకాన్ని చేపట్టింది. దేశంలో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రగ్యా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా నియమించింది. గతంలో ట్రూకాలర్‌లో ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా మిశ్రా విధులు నిర్వర్తించారు. అంతకుముందు వాట్సప్‌లోనూ ఆమె పని చేశారు. భారత్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓపెన్‌ఏఐ ఈ నియామకం చేపట్టడం గమనార్హం. గతేడాదిలోనే ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రధాని మోడీని కలిసి, ఏఐ సాంకేతికత గురించి కొనియాడారు. ఇతర దేశాల కంటే ముందుగా భారత్‌లోనే చాట్‌జీపీటీని ఎక్కువ మంది ఉపయోగించడం ప్రారంభించారని తెలిపారు. మరోవైపు ఏఐ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో దీనిపై నియంత్రణ తీసుకురావాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ నిబంధనలను అమలుచేసేందుకు ఓపెన్‌ ఏఐ చేపట్టిన తాజా నియామకం తోడ్పడనుంది.

Post a Comment

0 Comments

Close Menu