Ad Code

దేశంలో 2,12,627 ఖాతాలను నిషేధించిన 'ఎక్స్ కార్ప్' ?


పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలతను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా భారత్‌లో 'ఎక్స్ కార్ప్' (ట్విటర్) నెల వ్యవధిలో ఏకంగా 2,12,627 ఖాతాలను నిషేధించింది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఖాతాలను కూడా తొలగించినట్లు  వెల్లడించింది. 2021 కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఎక్స్ కార్ప్ తన నెలవారీ నివేదికలో ఈ చర్యలను వెల్లడించింది. ఎక్స్ కార్ప్ ప్రకారం, ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ వినియోగదారుల నుండి 5,158 ఫిర్యాదులు అందాయి. తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వీటిదని కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్‌లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కంపెనీ ప్రాసెస్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu